Janasena vs TDP: విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ – జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Chiranjeevi: LK అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు
తమకే టికెట్ కావాలని బల ప్రదర్శనకు దిగిన బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టార్గెట్ గా విమర్శలు చేశారు జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్.. పశ్చిమలో కొంత మంది నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్ల నుంచి వీళ్లంతా ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. చాక్లెట్ కొనివ్వని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే టికెట్ కావాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. కూతురుకి టికెట్ ఇచ్చి ఓడిపోతే ఎవరూ ఇక్కడ సూసైడ్ చేసుకోలేదు ఎందుకు? చివరకు నేను కూడా సూసైడ్ చేసుకోలేదు అంటూ జలీల్ ఖాన్ పై విమర్శలు గుప్పించారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని నిలదీశారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తే ప్రజలు ఆ ట్రాప్ లో పడరు అని హితవు పలికారు జనసేన విజయవాడ పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్.