NTV Telugu Site icon

Patamsetti Suryachandra: టికెట్‌ దక్కలేదు.. బోరున ఏడ్చేసిన జనసేన నేత

Patamsetti Suryachandra

Patamsetti Suryachandra

Patamsetti Suryachandra: టికెట్‌ దక్కలేదని బోరున ఏడ్చేశాడో జనసేన నేత. కాకినాడ జిల్లా జగ్గంపేట సీటును ఆదినుంచి జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్ర ఆశించారు. అయితే.. జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. ఈ రోజు విడుదల టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. అందులో జగ్గంపేట స్థానానికి జ్యోతుల నెహ్రూ పేరు ప్రకటించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోరున విలపించారు. డబ్బులు లేని వాళ్లు.. ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేన నేత సూర్యచంద్ర. కిర్లంపూడి మండలం గోనెడ నుంచి రామవరం వరకు.. అనుచరులతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే వారు రాజకీయాలు పనికిరారా అంటూ.. నిరసన తెలిపారు. కాగా, టీడీపీ-జనసేన తొలి జాబితాలో సీటు దక్కించుకున్నవారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటూ.. ప్రచారంపై ఫోకస్ పెడుతుండగా.. టికెట్‌ ఆశించి.. అది దక్కకపోవడంతో కొందరు సైలెంట్‌ అయ్యారు.. మరికొందరు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.

Read Also: Varun Tej: మెగాఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆపరేషన్‌ వాలెంటైన్‌ మీదే