Site icon NTV Telugu

Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో పసివాడికి చికిత్స.. నాగబాబు ఆర్థిక సహాయం

Nagababu Financial Help For

Nagababu Financial Help For

Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి శ్రీహర్షకు తన వంతు సాయం అందించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు నాగబాబు.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు శ్రీహర్ష గత 26 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న నాగబాబు విచారం వ్యక్తం చేస్తూ.. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక, పసివాడి శ్రీహర్ష ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు..

Read Also: MAA: మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

కాగా, గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శ్రీహర్షకు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. గుండె నుంచి కేవలం 10 శాతం మాత్రమే రక్తం పంపింగ్ అవుతున్నట్లు వైద్యులు వెల్లడించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.. 26 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతుండగా.. ఇప్పటివరకు రూ. 13 లక్షలు ఖర్చు చేసింది ఆ కుటుంబం… ఇంకా రూ. 10 లక్షలు అవసరమని ఆసుపత్రి అంచనా వేస్తోంది.. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గా ఉందని సమాచారం ఇచ్చారు వైద్యులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ నాగబాబు.. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు తన వంతుగా రూ.లక్ష ఇవ్వడంతో పాటు.. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. సోషల్‌ మీడియాలో చిన్నారి తండ్రి తనను కలిసి వీడియోతో పాటు బాధిత బాలుడికి సాయం చేసేందుకు సంబంధించిన డిజిటల్‌ పేమెంట్‌కు చెందిన క్యూఆర్ కోడ్‌ను కూడా షేర్‌ చేశారు నాగబాబు..

https://publish.twitter.com/?url=https://twitter.com/NagaBabuOffl/status/2025908951150424336#

Exit mobile version