జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి తెలిపారు. తమ నాయకుని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే.. తాము కూడా మాట్లాడాలి అనుకున్నాం కానీ పవన్ వద్దని సూచించారని చెప్పారు. సంస్కారం అడ్డువచ్చే తాము అలా మాట్లాడలేదని, పోసాని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పోసానిపై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా.. స్వీకరించలేదని జోగిమణి చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అసభ్య పదజాలం వాడిన పోసానిని గత రాత్రి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు.
నేడు జోగిమణి మీడియాతో మాట్లాడుతూ… ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. మా అధినేత, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే మేము కూడా మాట్లాడాలి అనుకున్నాం. కానీ మా నాయకుడు వద్దని సూచించారు. సంస్కారం అడ్డువచ్చే మేము మాట్లాడలేదు. అతని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. నేను ఎందుకు పుట్టాను, ఈ ఎదవ మానవ జన్మ అనే విధంగా మేము కూడా మాట్లాడగలం. గత ప్రభుత్వ హయంలో కూడా పోసానిపై ఫిర్యాదు చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేశాం, మా ఫిర్యాదులు స్వీకరించలేదు. మా నాయకుడికి భయపడి.. మేము అతనిలా బూతులు మాట్లాడలేదు. పోసాని మాట్లాడే మాటలు భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. ఆయన మాటలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సోషల్ మీడియా ఉందని వారి ఇష్టానుసారంగా మాట్లాడితే సమంజసం కాదు. ఇకనుంచి ఎవరైనా సోషల్ మీడియా ఉందని ఎలా అంటే అలా మాట్లాడకూడదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ ఫిర్యాదు చేశా’ అని తెలిపారు.