NTV Telugu Site icon

Janasena: ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు.. ఈఎంఐ మాత్రం కట్టుకోవాలి..!

Chirri Balaraju

Chirri Balaraju

Janasena: కొందరు డబ్బుల సంపాదించి రాజకీయాల్లోకి వస్తే.. మరికొందరు ప్రజల్లోనుంచి నాయకులుగా పుట్టుకొస్తారు.. ఆస్తులు, అంతస్తులు లేకపోయినా.. ప్రజలకు సేవ చేస్తూ.. చెరగని ముద్రవేస్తారు.. కొన్ని సార్లు ఎన్నిక రణరంగంలో అలాంటి వారు విజయం సాధించలేకపోవచ్చు.. కానీ, ఎప్పుడో ఒకసారి మాత్రం.. తమ టార్గెట్‌ను చేరుకుంటారు.. అలాంటి నేతల్లో ఒకరు జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన.. నిరుత్సాహంతో వెనుదిరగకుండా.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అసెంబ్లీలో అడుగుపెట్టారు.. అయితే, ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన బాలరాజు.. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగాలన్నా.. అసెంబ్లీకి వెళ్లాలన్న.. ఇతర సమావేశాలు, సమీక్షలు, మీటింగ్‌లకు వెళ్లాలన్నా.. ఇబ్బందిగా ఉందని గుర్తించిన జనసైనికులు.. తమ నేత కోసం అంతా చందాలు వేసుకున్నారు.. కరాటం రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు.. బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు కొంత నగదు సేకరించారు.. ఆ మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ చేసి.. టయోటా ఫార్చ్యూనర్ కారు బుక్‌ చేశారు.. ఆ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్ట్‌గా ఇచ్చారు..

Read Also: Hyderabad Water: హైదరాబాద్‌ ప్రజలు అలర్ట్‌.. 4,5న నీళ్లు బంద్‌..!

అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్‌ ఉంది.. డౌన్‌పేమెంట్‌ వరకు వారు చెల్లించారు.. కానీ, మిగతా మొత్తాన్ని ఈఎంఐల రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించాల్సి ఉంటుంది.. ఎందుకంటే డౌన్‌పేమెంట్‌ డబ్బు వరకు చెల్లించారు.. మొగతా మొత్తాన్ని ఎమ్మెల్యేకు నెలవారి వచ్చే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు అభిమానులు.. మొత్తంగా తమ ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక సామాన్య నిరుపేద రైతుని ఎమ్మెల్యేగా గెలిపించడమే కాక 175 ఎమ్మెల్యేల్లో మా ఎమ్మెల్యే ఏ మాత్రం తీసిపోడు అనే విధంగా కరాటం రాంబాబు సోదరుల చేతుల మీదుగా ఈ రోజు జన సైనికుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కారును అందజేశారు. కాగా, కరాటం రాంబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బాలరాజు.. 2019లో జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. కానీ, ఎక్కడా వెనుదిరగకుండా.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు.. ఇక, 2024 ఎన్నికల్లో పోలవరం సీటు ఎవరికి అనే చర్చ సాగినా.. చివరికి కూటమి జనసేనకే పోలవరం సీటు కేటాయించింది.. దాంతో మరోసారి బాలరాజుకే సీటు కేటాయించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కూటమి మద్దతు.. జనసేన నేతలు, కార్యకర్తలు.. మొక్కవోనీ దీక్షతో అహర్నిశలు కష్టపడి.. చిర్రి బాలరాజును గెలిపించి.. అసెంబ్లీకి పంపించారు.. ఇప్పుడు.. కారును గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.