పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజక వర్గాల ఎం.ఎల్.సి. స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నాను.
Read Also: Harrasment : తల్లి కాదు రాక్షసి.. బాలికపై అమానుషంగా దాడి
సందిగ్ధంలో ఉన్నవారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అధోగతిపాలు చేస్తున్న తీరును పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసించారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియచేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇటువంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందన్న సంగతి, ఈ ఎన్నికల ద్వారా ముందుగానే స్పష్టమైంది. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, విజేతలకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
Read Also:Harrasment : తల్లి కాదు రాక్షసి.. బాలికపై అమానుషంగా దాడి