కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు కొణతాల నిర్ణయించుకోవడం హర్షణీయం అని అన్నారు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన.. జనసేనలోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడు కొణతాల అని అన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేసేందుకు, పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల సేవలు దోహదమవుతాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
Read Also: Bharat Jodo Nyay Yatra: అస్సాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి..
కాగా.. ఈ మధ్యనే కొణతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులపై పవన్ -కొణతాల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. మంచిరోజు చూసుకొని ఈ నెలలోనే జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం బరిలోకి దిగాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు.
Read Also: Ram Mandir Event: రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన రాజకీయ నాయకులు వీరే..