Site icon NTV Telugu

Jana Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తాం..

Janareddy

Janareddy

నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామన్నారు. మా పథకాలను చూసి కేసీఆర్‌ తన పథకాలను మార్చుకున్నారన్నారు. మేనిఫెస్టోలో వచ్చిన పథకాలను కాంగ్రెస్ పార్టీని చూసి భయపడే వచ్చినవేనని ఆయన వ్యాఖ్యానించారు. మేము చెప్పింది చేస్తామని, నిజంగా పథకాలు అమలు లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలన్నారు జానారెడ్డి. రైతుబంధు మినహా బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆమాలు చేసినవేనని ఆయన వెల్లడించారు.

Also Read : Revanth Reddy : ఈ మధ్య కేసీఆర్ కాంగ్రెస్‌ని ఫాలో అవుతున్నారు.. బీ ఫామ్ కూడా 51 మందికే ఇచ్చారు

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదివారం విడుదల చేసింది . తొలి జాబితాలో మొత్తం 55 మంది పేర్లు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి అభ్యర్థుల్లో ముఖ్యమైనవారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మొన్న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Also Read : Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కి పెళ్లయిందా? షాక్ లో ఆడియన్స్..

Exit mobile version