Site icon NTV Telugu

Kadiyam Srihari : జనగామ జిల్లా రాజకీయ వేడి… కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari : జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం, చిన్న పెండ్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, “పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకోవాలి” అని ఘాటుగా విమర్శించారు.

బీఆర్‌ఎస్ పాలనపై ధ్వజమెత్తిన కడియం శ్రీహరి, “కేసీఆర్ వెంటే తిరిగి బీఆర్‌ఎస్ పార్టీని బ్రష్టు పట్టించావు. అధికారాన్ని, కేసీఆర్‌ను అడ్డంపెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్నావు. అవినీతి, అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు. నీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు” అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. “మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసు. నీలాంటి వెధవల వల్లే కేసీఆర్ పరిపాలన పక్కదారి పట్టింది. ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పారు” అని కడియం శ్రీహరి ఘాటుగా వ్యాఖ్యానించారు.

తాను ఉమ్మడి వరంగల్ జిల్లా , స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధికి చేసిన కృషిని ప్రస్తావిస్తూ, “నేను అభివృద్ధి కోసం పని చేశాను. ఎవరికైనా అభివృద్ధిపై చర్చ చేయాలనుకుంటే సిద్ధం” అంటూ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో జనగామ జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Kerala: కేరళ సీఎం విజ‌య‌న్‌కు షాక్.. కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి

Exit mobile version