Site icon NTV Telugu

Pawan Kalyan: పెండింగ్‌ సీట్లపై ఏటూ తేల్చుకోలేకపోతోన్న జనసేన..!

Pawan 2

Pawan 2

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా వచ్చేసింది.. అయితే, మిత్రపక్షాలైన తెలుగుదేశంపార్టీ – జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ.. ఇంకా కొన్ని సీట్లపై తేల్చలేకపోతున్నాయి.. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించారు.. అయితే, జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. కానీ, విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండింగులో పెట్టింది.

Read Also: Tillu Square Review: టిల్లు స్క్వేర్ రివ్యూ

అయితే, పెండింగ్‌లో ఉన్న సీట్లల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటి వరకు ఏటూ తేల్చుకోలేకపోతోంది జనసేన పార్టీ.. మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుపై ఇంకా క్లారిటీకి రాలేదు.. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ కసరత్తు చేశారు.. అయినా ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ఫైనల్‌ చేసినట్టుగా కనిపించడంలేదు.. మరోవైపు డైలామాలోనే బందరు పార్లమెంట్ సీటు వ్యవహారం ఉంది.. మరింత మంచి అభ్యర్థుల కోసం పవన్ కల్యాణ్‌ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది.. అంగ బలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల కోసం జనసేనాని గాలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలిసారి తాను ఎన్నికల బరిలోకి దిగుతోన్న పిఠాపురంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేనాని పిఠాపురంలో పర్యటించబోతున్నారు.. తొలి రోజు శ్రీ పురుహూతిక దేవి అమ్మవారి ఆలచాన్ని దర్శించుకోనున్నారు పవన్‌.. అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా తొలిరోజు బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లోనూ పాల్గొనబోతున్నారు.. తొలిరోజు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు ఆ పార్టీ శ్రేణులు..

Exit mobile version