Site icon NTV Telugu

Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?

Jananagan Trailor

Jananagan Trailor

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయకుడు’ (తమిళంలో ‘జన నాయగన్’) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా ట్రైలర్‌పైనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 2న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు కేవలం వారం రోజుల ముందే ట్రైలర్ వస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం ఏదైనా సినిమాకు రీమేకా? లేక ఒరిజినల్ కథా? అనే సందిగ్ధతకు ఈ ట్రైలర్‌తో తెరపడే అవకాశం ఉంది.

Also Read : Trivikram Srinivas: మొదటి రోజు నెగటివ్ టాక్.. అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చిన త్రివిక్రమ్!

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్న నేపథ్యంలో వస్తున్న చివరి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version