NTV Telugu Site icon

Mallikarjun Kharge: క్షీణించిన మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం.. వేదికపై ప్రసంగిస్తూ..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు. వేదికపై ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోబోగా.. ఆయన పక్కనున్న భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు సకాలంలో ఆయన దగ్గరకు వెళ్లి పట్టుకున్నారు. మంచి నీళ్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని కొంతసేపు నిలిపివేశారు.

READ MORE: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..

అంతా సర్దుమనిగాక.. ఖర్గే మాట్లాడుతూ.. మోడీని అధికారం నుంచి గద్దె దించే వరకు తాను చనిపోనన్నారు. “ఈ వ్యక్తులు (కేంద్ర ప్రభుత్వం) జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఎప్పుడూ కోరుకోలేదు. వారు తలచుకుంటే ఒకట్రెండేళ్లలోపు పూర్తి చేసి ఉండేవారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా రిమోట్‌ ప్రభుత్వాన్ని నడపాలనుకున్నారు. గత 10 ఏళ్లలో భారత యువతకు ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదు. 10 సంవత్సరాలలో మీ శ్రేయస్సును తిరిగి తీసుకురాలేని వ్యక్తిని మీరు విశ్వసించగలరా? మీ ముందుకు బీజేపీ నేతలెవరైనా వస్తే శ్రేయస్సు తెచ్చిందో లేదో అడగండి.” అని వ్యాఖ్యానించారు.

READ MORE:Hezbollah: హసన్ నస్రల్లా ఎక్కడ ఉన్నాడో చెప్పింది ఇరాన్ గూఢచారి.. ఆ తర్వాతే ఇజ్రాయిల్ ఎటాక్..

మరోవైపు, కథువా జిల్లాలోని బిల్వార్ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి జమ్మూ కాశ్మీర్ పరిపాలన సహాయం చేయలేదని, ఆమె ప్రచారానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. వాస్తవానికి, ప్రియాంక గాంధీ జమ్మూ ప్రాంతంలోని బిల్లావర్, బిష్నా నియోజకవర్గాలలో ర్యాలీలలో ప్రసంగించవలసి ఉంది. కానీ ఆమె హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాలేదు. దీంతో ఆమె పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి డాక్టర్ మనోహర్ లాల్ కు మద్దతు కోరలేకపోయారు.

Show comments