Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌కు సంబంధించి హైకోర్టు నుంచి అనుకూల ఆదేశాలు వచ్చాయి. దీంతో నేడు జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఇందిరమ్మ నిర్ణయించుకున్నారు. అయితే ఇందిరమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుండ్లకుంటలోని ఇందిరమ్మ స్వగృహం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటి నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వడం లేదని ఇందిరమ్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఇందిరమ్మ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చట్టప్రకారం తమకు నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉందని ఇందిరమ్మ, రామసుబ్బారెడ్డి అంటున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల ప్రక్రియలో తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. గుండ్లకుంటలో చోటుచేసుకున్న పరిణామాలతో జమ్మలమడుగు రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Also Read
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
- Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
హౌస్ అరెస్ట్ చేయడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంతటి అరాచకమైన పరిపాలనను నేను ఎప్పుడూ చూడలేదు. నామినేషన్లు వేయడానికి కూడా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల ప్రక్రియలో మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇందిరమ్మకు అవకాశం లభిస్తుందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? హైకోర్టు ఆదేశాల అమలుపై అధికారులు ఎలా స్పందిస్తారు? అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!