Site icon NTV Telugu

James Cameron – Rajamouli: జక్కన్నకు జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్.. ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!

James Cameron Rajamouli

James Cameron Rajamouli

James Cameron – Rajamouli: ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవతార్ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన గొప్ప దర్శకుడిగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ సిరిస్‌లోని మూడో భాగం ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో ‘అవతార్‌’ టీమ్‌ ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని వినూత్నంగా ఆరంభించింది. కొంత మంది సినీ ప్రముఖులకు ఈ చిత్రాన్ని చూపించారు. వారిలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి కూడా ఉన్నారు.

READ ALSO: SRH Team 2026: మాన్‌స్టర్ వచ్చేశాడు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత మారేనా?

ఈ సినిమా ప్రదర్శన అనంతరం అవతార్ సృష్టికర్త జేమ్స్‌ కామెరూన్‌, దర్శకధీరుడు రాజమౌళి వీడియో కాల్‌‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ సినిమా మేకింగ్‌, పాత్రల తీరు తెన్నుల గురించి చర్చించుకున్నారు. అనంతరం ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘అందరి కంటే ముందు ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ చూడటం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కామెరూన్‌-జక్కన్నతో మాట్లాడుతూ.. ‘వారణాసి’ సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కామెరూన్ మాట్లాడుతూ.. ‘వారణాసి’ సినిమా షూటింగ్‌‌కు రావచ్చా అని అడిగారు. దీనికి జక్కన్న తెగ సంబరపడిపోయి.. ‘‘మీరు షూటింగ్‌కు రావడం మా ‘వారణాసి’ టీమ్‌‌కు మాత్రమే కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ థ్రిల్‌ అవుతుంది’ అని అన్నారు.

READ ALSO: Inspector Harassment: ఇవేం వేధింపులు.. పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు రక్తంతో ప్రేమ లేఖ

Exit mobile version