James Anderson: ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో టాప్ పేసర్ గా నిలిచిన జేమ్స్ అండర్సన్.. వచ్చే సీజన్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో లాంకాషైర్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 43 ఏళ్ల వయసులో ఈ బాధ్యతలు స్వీకరించడం అతని కేరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2002లో లాంకాషైర్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అండర్సన్, 2024లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా కౌంటీ కోసం ఆడుతున్నారు. గత సీజన్‌లో తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహించిన ఆయన, నవంబర్‌లో మరో ఏడాది ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం ఈసారి శాశ్వత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Messi Hyderabad Schedule: హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
అండర్సన్ ఈ నియామకంపై ఆనందం వ్యక్తం చేశాడు. లాంకాషైర్‌కు నేతృత్వం వహించడం తనకు గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నాడు. యువత, అనుభవజ్ఞుల సమ్మేళనం ఉన్న లాంకాషైర్ జట్టుతో కలిసి డివిజన్ వన్‌కు ప్రమోషన్ సాధించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక తన నాయకత్వంలో జట్టు మరింతగా మెరుగైన ప్రదర్శన చేయగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ తరుఫున 188 టెస్టుల్లో 704 వికెట్లు తీసిన అండర్సన్ కేవలం ఇంగ్లాండ్‌కే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. జేమ్స్ అండర్సన్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ 2026 ఏప్రిల్ 3న నార్తాంప్టన్షైర్‌తో అవేగ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. లాంకాషైర్‌కు తిరిగి పాత ప్రతిష్ఠను తీసుకురావడానికి అండర్సన్ నాయకత్వం ఎంతవరకు దోహదం చేస్తుందో క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Sashivadane: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘శశివదనే’..
