Site icon NTV Telugu

Fact Check: రాఫెల్ ఒప్పందంపై భారత్ రహస్య లేఖ లీక్..? జోరుగా ప్రచారం చేస్తున్న పాకిస్థాన్

Latter

Latter

Fact Check: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు చెందిన భారత రాయబారి థియరీ మాథూకు రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ లేఖలో భారత నౌకాదళానికి రఫేల్ యుద్ధవిమానాల డెలివరీ సమయంపై మీడియాలో వచ్చిన కథనాలపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు, అది లీక్ అయిన లేఖ అని పోస్టులు చెబుతున్నాయి. అయితే ఓ న్యూస్ ఏజెన్సీ చేసిన దర్యాప్తులో ఈ వాదన పూర్తిగా అబద్ధమని తేలింది. ఈ లేఖ పూర్తిగా కల్పితం కాగా, పాకిస్థాన్‌కు చెందిన ఒక సోషల్ మీడియా ఖాతా దీన్ని ప్రచారం చేస్తోంది.

READ MORE: The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి

‘డిస్కోర్స్ ల్యాబ్’ అనే సోషల్ మీడియా యూజర్ ఈ లేఖ చిత్రాన్ని షేర్ చేస్తూ.. “జైశంకర్ ఫ్రాన్స్‌కు రాసిన లేఖ ఒక విషయం స్పష్టం చేస్తోంది. రఫేల్ వివాదం ఇంకా ముగియలేదు. లీకైన సమాచారంతో న్యూఢిల్లీ ఇబ్బందులు పడుతోంది” అని క్యాప్షన్ పెట్టాడు. ఇదే తరహా వ్యాఖ్యలతో మరిన్ని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. వైరల్ పోస్టులో ఉన్న లేఖ పైకి చూస్తే అధికారికంగా విదేశాంగ మంత్రి రాసిన లేఖలా కనిపించినప్పటికీ.. నిజాన్ని తెలుసుకునేందుకు న్యూస్ ఏజెన్సీ పరిశీలన చేపట్టింది. ‘ఎస్ జైశంకర్ లేఖ’ అనే కీలక పదాలతో సోషల్ మీడియాలో వెతికితే, @HRNagendra1 అనే ఖాతా షేర్ చేసిన ఒక నిజమైన లేఖ లభించింది. అది విదేశాంగ మంత్రి పంపిన అధికారిక లేఖ. ఆ అసలైన లేఖలో అశోక స్తంభ చిహ్నం, జైశంకర్ సంతకం స్పష్టంగా ఉన్నాయి. వైరల్ లేఖతో దీన్ని పోల్చితే రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు కనిపించాయి.

READ MORE: The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి

అంతేకాదు.. ఈ వైరల్ లేఖను నిర్ధారించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించగా, మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఈ లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయంపై విదేశాంగ వ్యవహారాలను కవర్ చేసే సీనియర్ జర్నలిస్ట్ మధురేంద్ర కుమార్‌ సైతం ఈ వార్తలను తిప్పికొట్టారు. ఈ లేఖ నకిలీదేనని ఆయన స్పష్టం చేశారు. వైరల్ లేఖను పాకిస్థాన్ నుంచి షేర్ చేస్ఉతన్నారని దర్యాప్తులో తేలింది. ఆ ఖాతా ఏప్రిల్ 2025 నుంచి ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉంది.

Exit mobile version