Site icon NTV Telugu

Jairam Ramesh: అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ యాత్ర

Congress2

Congress2

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. తెలంగాణలో రాహుల్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, ఇతర విషయాల గురించి దిగ్విజయ్ సింగ్ తో కలిసి బోయిన్ పల్లిలో ఆయన చర్చించారు. రాహుల్ గాంధీ ఇవాళ..రేపు దసరా సందర్బంగా బ్రేక్ ఇచ్చారు. ఎల్లుండి భారత్ జోడో యాత్ర యథావిధిగా మొదలవుతుంది. కర్ణాటక లో 11 కిలోమీటర్లు పూర్తి అయింది. 95 కిలోమీటర్లు ఆంధ్రలో ఉంటుంది ..నాలుగు రోజులు యాత్ర అక్కడ వుంటుందన్నారు జైరాం రమేష్.

మన్ కీ బాత్ యాత్ర కాదు.. జోడో యాత్ర లిసనింగ్ యాత్ర. జనతాకి చింతా.. మోడీ నే సర్వ జ్ఞాపి.. సర్వ వ్యాపి.. రాజ్యాంగం అమలు లేదు.. వ్యవస్థలు లేవు. రాహుల్ గాంధీ పాదయాత్రకి కర్ణాటక లో మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు జైరాం రమేష్. జోడో యాత్ర ఎఫెక్ట్ RSS మీద పడిందన్నారు. ముస్లిం పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. పేదరికంపై, అసమానతలపై మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఇప్పుడు భారత్ జొడో గురించే చర్చ జరుగుతుంది.

Read ALso: Vasuki: పవన్ కళ్యాణ్ చెల్లెలు రీ ఎంట్రీ.. 24 ఏళ్ల తరువాత ఎలా ఉందో చూడండి

తెలంగాణ ప్రజలు బయటకు రండి. బీజేపీ కి బలమైన సంకేతం ఇవ్వండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకే కాదు టీఆర్ఎస్ కి కూడా గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణలో 375 కిలోమీటర్లు, 13 రోజులు పాదయాత్ర ఉంటుందన్నారు. కాంగ్రెస్ pds డిస్ట్రిబ్యూట్ చేసింది.. కానీ trs లిక్కర్ పంపిణీ చేస్తుంది. గంట క్రితం ఫోటో చూశా.. బీజేపీ డబుల్ ఇంజన్ అంటే… ఒకటి బీజేపీ..రెండోది టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు జైరాం రమేష్.

బీజేపీ, టీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. TRS కి BRS సమయం కాదు సీఎం కేసీఆర్ కి అది VRS అని సెటైర్లు వేశారు జైరాం రమేష్. ఢిల్లీలో సుల్తాన్… తెలంగాణలో నిజాం అన్నారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పెద్ద వాళ్ళకే బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. నోట్ల రద్దు నుంచి అదే వ్యవహారం నడుస్తోందన్నారు. పేదలు అలాగే ఉండి పోతున్నారు.. రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతున్నారన్నారు దిగ్విజయ్ సింగ్. దేశంలో అశాంతి పెరిగింది. అశాంతితో దేశం అభివృద్ధి చెందదు. రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేశారు. కానీ కన్యాకుమారి నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు పెట్టారు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ని విజయవంతం చేయాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.

ఢిల్లీలో అయితే బీజేపీ… లేదంటే కాంగ్రెస్సే.. బీజేపీ ఈడీ, సీబీఐలను వాడుతుంది. రాహుల్..సోనియా గాంధీలను కూడా పిలిచింది. నేషనల్ హెరాల్డ్ నుండి రూపాయి కూడా రాహుల్ గాంధీ ఖాతాలోకి రాలేదు. నేషనల్ హెరాల్డ్ కి మా నాయకులు చందా ఇచ్చినా ఈడీకి ఇబ్బంది అవుతుందన్నారు దిగ్విజయ్ సింగ్. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరుగుతుంది. బార్ కోడ్ తో కూడిన ఓటర్ కార్డ్ ఏ పార్టీలో అయినా ఉంటుందా..? అన్నారు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్.

Read Also: Doctors Molested Woman: దారుణం.. కలవాలని పిలిచి మహిళపై డాక్టర్లు అత్యాచారం

Exit mobile version