Site icon NTV Telugu

Jaipur Accident: జైపూర్‌లో మృత్యు ఘోష.. 10 మంది మృతి.. 40 మందికి తీవ్ర గాయాలు

Jaipur Accident

Jaipur Accident

Jaipur Accident: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక డంపర్ ట్రక్కు కారణంగా 10 మంది మృతి చెందగా, సుమారుగా 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఈ డంపర్ ట్రక్కు ఒక కారును, ఆ తర్వాత మరో నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా 10 మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే సుమారుగా 40 మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

READ ALSO: Shafali Verma Comeback: జట్టు నుంచి తొలగించారు, తండ్రికి గుండెపోటు.. షెఫాలీ భాధలు వర్ణనాతీతం!

హర్మారా పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రమాదం..
హర్మారా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహా మండి రోడ్డుపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. డంపర్ ఎదురెదురుగా ఉన్న దేనిపైనైనా దూసుకెళ్లిందని, దాదాపు 50 మందిని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ వాహనం డ్రైవర్ తాగి ఉన్నాడని, ఆయన మొదటి కారును ఢీకొట్టిన తర్వాత, వాహనాన్ని ఆపకుండా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. డంపర్ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడని చెప్పారు. ఇప్పటికీ కొంతమంది కార్ల కింద చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు, వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ ప్రమాదంలో సుమారుగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

READ ALSO: Siva: మోహన్‌బాబు లేనందునే.. ‘శివ’ విజయం సాధ్యమైంది – వర్మ

Exit mobile version