క్రమశిక్షణ, మర్యాద, సాంస్కృతిక విలువలను కాపాడేందుకు సిమ్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన ఓ జైన ఆలయంలోకి పొట్టి బట్టలు ధరించి వచ్చే భక్తులను నిషేధించారు. శ్రీ దిగంబర్ జైన సభ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ లో కొత్త డ్రెస్ కోడ్ ను సూచిస్తూ ఆలయం వెలుపల ఒక నోటీసును పెట్టారు. స్త్రీ-పురుషులు అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి రావాలని తెలిపారు.
Also Read: Weather In Telangana: ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి వర్షాలు
పొట్టి దుస్తులు, హాఫ్ ప్యాంట్, బెర్ముడా, మినీ స్కర్ట్, నైట్ సూట్, చిరిగిన జీన్స్, ఫ్రాక్, త్రీ క్వార్టర్ జీన్స్ తదితరాలు ధరించిన వారు ఆలయ ప్రాంగణం లోపలికి అనుమతి లేదని సిమ్లా జైన్ ఆలయం బయట నోటీసులో పేర్కొన్నారు. మహిళల్లో మారుతున్న ఫ్యాషన్, వస్త్రధారణ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైన ఆలయ పూజారి ఒకరు తెలిపారు. ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులు ధరించాలి.. దేవాలయాలను సందర్శించే అలవాటుకు ప్రజలు దూరమవుతున్నారు. నేటి కాలంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కష్టంగా మారుతోంది అని ఆయన అన్నారు.
Also Read: Cyclone Hits Brazil: బ్రెజిల్ ను తాకిన తుఫాన్.. ఇప్పటివరకు 11 మంది మృతి, 20 మంది గల్లంతు
గతంలో మన పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించే వారు.. కానీ ఇప్పటి యువత, వయోజన మహిళలు పొట్టి దుస్తుల్లో ఆలయాలను సందర్శిస్తున్నారన్నారు. ఇది మంచిది కాదన్నారు. పాశ్చాత్య అలవాట్లు, సంస్కృతి మన మత విలువలను దెబ్బతీస్తున్నాయని సదరు పూజరి అన్నారు. మత నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైన ఆలయ పూజారి స్పష్టం చేశారు. ఇతర మతాలను ఆచరించే వ్యక్తులు తమ ప్రధాన మత విశ్వాసాల నుండి ఎప్పటికీ వైదొలగరని అన్నారు. కాగా.. బట్టలపై నిషేధం శతాబ్దాల పురాతన ఆలయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని భక్తులు అంటున్నారు.