Jailer : టీవీ లో టెలికాస్ట్ కాబోతున్న రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్‌లతో ఇబ్బంది పడుతున్నాడు..అయితే తాజాగా వచ్చిన జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అప్పటి వరకు వున్న తమిళ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు రజనీకాంత్. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమా లో రజనీతో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మరియు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10 న థియేటర్లలో రిలీజైన జైలర్ బాక్సాఫీస్ రికార్డులన్నీ కొల్లగొట్టింది. ముఖ్యంగా రజనీకి అదిరిపోయే కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా తలైవా సినిమా కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన జైలర్ మూవీ మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా థియటేర్లు, ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.జైలర్ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని సొంతం చేసుకుంది. త్వరలో ఈ బ్లాక్ బస్టర్ ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది.నవంబర్ రెండో వారం లేదా దీపావళి పండగ సందర్భంగా జైలర్ సినిమాను ప్రసారం చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన జైలర్ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా విజయంలో అనిరుధ్ బీజీఎమ్ ముఖ్య పాత్ర పోషించింది. మరి జైలర్ మూవీ టీవీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Also Read
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
తాజావార్తలు
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!