NTV Telugu Site icon

Jailer : జైలర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

Whatsapp Image 2023 08 31 At 3.16.11 Pm

Whatsapp Image 2023 08 31 At 3.16.11 Pm

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో  కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ మరియు మలయాళ. సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ అలాగే జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్‌ వంటి తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు.ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయింది. మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే విజయం సాధించింది.జైలర్‌ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో తమిళ్‌ మూవీగా రికార్డులు నెలకొల్పింది.ఇంతలా కాసుల వర్షం కురిపిస్తోన్న తరుణంలో జైలర్‌ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది.

నిన్నటి నుంచి పలు పైరసీ సైట్లలో ఈ సినిమా దర్శనమిస్తోంది. దీంతో రజనీ ఫ్యాన్స్‌ ఎంతో ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న సమయంలో దయచేసి పైరసీని ఎంకరేజ్‌ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ కూడా జైలర్‌ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. అయితే జైలర్‌ లోని పలు సన్నివేశాలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. జైలర్‌ సినిమా థియేటర్లలో విడుదల అయి మూడు వారాలు గడిచిపోయింది. అయితే ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ముందుగా సెప్టెంబర్ 7న స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని అంతా కూడా భావించారు. ఇప్పుడు ఆ డేట్ కు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తే థియేటర్‌ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని మేకర్స్‌ భావిస్తున్నారు.. అయితే ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాతే జైలర్‌ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారని సమాచారం.దీనితో జైలర్ సినిమాను వినాయక చవితి సందర్భంగా స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

Show comments