Jailer : జైలర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్. తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ మరియు మలయాళ. సూపర్ స్టార్ మోహన్‌లాల్ అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్ వంటి తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు.ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయింది. మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే విజయం సాధించింది.జైలర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో తమిళ్ మూవీగా రికార్డులు నెలకొల్పింది.ఇంతలా కాసుల వర్షం కురిపిస్తోన్న తరుణంలో జైలర్ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది.
నిన్నటి నుంచి పలు పైరసీ సైట్లలో ఈ సినిమా దర్శనమిస్తోంది. దీంతో రజనీ ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ కూడా జైలర్ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. అయితే జైలర్ లోని పలు సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. జైలర్ సినిమా థియేటర్లలో విడుదల అయి మూడు వారాలు గడిచిపోయింది. అయితే ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ముందుగా సెప్టెంబర్ 7న స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని అంతా కూడా భావించారు. ఇప్పుడు ఆ డేట్ కు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తే థియేటర్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.. అయితే ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాతే జైలర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం.దీనితో జైలర్ సినిమాను వినాయక చవితి సందర్భంగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!