Jailer2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

Jailar 2

Jailar 2

సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమా లో ‘జైలర్’ ఒకటి. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక పక్కా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం ‘జైలర్’ 2023 ఆగస్టు 10న విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అందుకే, ఇప్పుడు సీక్వెల్‌ను కూడా అదే ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.

Also Read : Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్ కొత్త.. ప్రేమాయణం!

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2026 ఆగస్టు 12 లేదా 14న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ లేదా జులైలోనే షూటింగ్ పూర్తయినా, ఆగస్టు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ పార్ట్‌లో కూడా శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా కనిపిస్తారనే ప్రచారం సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్‌తో ఈసారి కూడా రజినీ తన స్వాగ్‌తో థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.