Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jailed Waris Punjab De Chief Amritpal Singh To Contest Lok Sabha Election From Punjab

Amritpal Singh: లోక్‌సభ బరిలోకి ఖలిస్థానీ ఉగ్రవాది.. ఎక్కడ నుంచంటే..!

Published Date :April 24, 2024 , 6:56 pm
By Suresh Maddala
Amritpal Singh: లోక్‌సభ బరిలోకి ఖలిస్థానీ ఉగ్రవాది.. ఎక్కడ నుంచంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఖలిస్థానీ టెర్రరిస్టు అమృతపాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా తెలిపారు. ప్రస్తుతం అమృతపాల్ సింగ్ అస్సాం జైల్లో ఉన్నారు. ఆయన పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జైల్లో అమృతపాల్ సింగ్‌ను కలిసినట్లు ఆయన న్యాయవాది తెలిపారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అమృతపాల్ సింగ్‌ తనకు తెలియజేశాడని న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా పేర్కొన్నారు.

జాతీయ భద్రతా చట్టం కింద వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. 2023, ఏప్రిల్‌లో 29 ఏళ్ల అమృతపాల్ సింగ్ అరెస్ట్ చేసి… కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద జైలు శిక్ష విధించారు.  ప్రస్తుతం అసోంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నారు. అమృతపాల్ సింగ్‌ను తన న్యాయవాది కలిశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయడంపై తదుపరి చర్చలు జరిపేందుకు ఆయన కుటుంబసభ్యులు కూడా గురువారం జైలులో ఆయనను కలవనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో 7వ దశలో ఖాదూర్ సాహిబ్ స్థానానికి జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి లాల్‌జిత్‌ సింగ్‌ భుల్లార్‌ను బరిలోకి దించగా.. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) తరఫున హర్‌పాల్‌ సింగ్‌ బలేర్‌ బరిలో నిలిచారు.

ఇది కూడా చదవండి: Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి సమక్షంలో వైసీపీలో చేరికలు..

పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఒకే దశలో పోలింగ్ జరగనుంది. చివరి విడతలో.. అనగా.. జూన్ 1న అన్ని స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో 43.95% ఓటింగ్‌తో కాంగ్రెస్ నుంచి జస్బీర్ సింగ్ గిల్ గెలిచారు. శిరోమణి అకాలీదళ్‌ నుంచి బీబీ జాగీర్ కౌర్ 30.51% ఓటింగ్‌తో రన్నరప్‌గా నిలిచారు. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

అలాగే సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ కూడా బటిండా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సిన అవసరం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amritpal Singh
  • contest
  • Jailed Waris Punjab De Chief
  • Khadoor Sahib
  • Lok Sabha Election 2024

తాజావార్తలు

  • Microsoft Windows: మైక్రోసాఫ్ట్‌కు ఫ్రాన్స్ బిగ్ షాక్.. ప్రభుత్వ కంప్యూటర్ల నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌ తొలగింపు

  • Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions