NTV Telugu Site icon

Jai Hanuman Theme Song: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్

Jai Hanuman

Jai Hanuman

Jai Hanuman Theme Song: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చి భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. అయితే, తాజాగా జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పి, అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచారు చిత్ర బృందం సభ్యులు. ఈ దెబ్బతో ‘జై హనుమాన్’ సినిమాపై మరిన్ని అంచనాలు ప్రజల్లో నెలకొన్నాయి.

Read Also: Sangareddy: బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రశాంత్ వర్మ సినిమాలపై ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. బుధవారం నాడు జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా జై హనుమాన్ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ థీమ్ కు ఓజెస్‌ అందించిన స్వరాలకు, కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం. ఇంకెదుకు ఆలస్యం మీరు కూడా.. ‘జై హనుమాన్’ సినిమా ఫస్ట్ లుక్ థీమ్ సాంగ్ వినేతే పోలె.

Show comments