Jagtial: వదిలేసిన తల్లిని రోడ్డుపై వదిలేసిన ఉదంతం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నేను వస్తా RDO ఆఫీస్‌కి నువ్వు వేళ్ళు అంటూ చిన్న కొడుకు తల్లిని ఆటోలో ఎక్కించాడు. సాయంత్రమైనా ఇద్దరు కొడుకులు రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి నీళ్లు లేక చలిలో వణుకుతూ అక్కడే ఉండిపోయింది ఆ వృద్ధురాలు.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకుల ఇలా వదిలేయం అందరినీ కంటతడి పెట్టించింది. చలికిలో వణుకుతు ఆ తల్లి ఆశ్రయం కోసం RDO కార్యాలయం ఎదుట వేచి ఉండిపోయింది. ఆర్డీవో మధుసూదన్ వివరాలు తెలుసుకొని పెద్ద కొడుకు వద్దకు పంపారు. సోమవారం ఇద్దరు కొడుకులు తన ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అసహాయంగా మారిన వృద్ధురాలి పట్ల స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Ranbir – Alia Bhatt : ఇటలీ ఫర్నిచర్ నుండి టెర్రస్ గార్డెన్ వరకు.. రణబీర్–అలియా లగ్జరీ హోమ్ స్పెషల్స్
మల్యాల మండలానికి చెందిన వృద్ధురాలు లక్ష్మికి ఇద్దరు కొడుకులు.. పెద్దోడు కృష్ణ, చిన్నోడు శ్రీనివాసులు. పెద్ద కొడుకు కృష్ణ జగిత్యాలలో స్థిర పడగా, శ్రీనివాస్ మల్యాలలో నివాసం ఉంటున్నాడు.. ఆస్థి పంపకాల్లో శ్రీనివాస్ కు పాత ఇల్లు రాగా, పాత ఇంటిని కూల్చేసి, కొత్త ఇల్లు కట్టుకున్నాడు. తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు చిన్న కొడుకు శ్రీనివాస్ నిరాకరించాడు.. దీంతో వృద్ధురాలు పెద్ద కొడుకు కృష్ణ వద్ద ఉంది. మళ్ళీ వృద్ధురాలు చిన్న కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్ళగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్య పరిష్కరించేందుకు నువ్వు వెళ్ళు నేను ఆర్డీఓ ఆఫీస్ కు నేను వస్తాను అంటూ తల్లిని ఆటోలో ఎక్కించాడు చిన్నకొడుకు శ్రీనివారసులు. ఉదయం RDO ఆఫీస్ కి వెళ్ళిన తల్లి వద్దకు ఇద్దరు కొడుకులు రాకపోవడంతో తిండి, నీళ్లు లేక సాయంత్రం వరకు ఆర్డీఓ ఆఫీస్ ఎదుట చలిలో వణుకుతూ ఉండిపోయింది ఆ తల్లి.. గమనించిన ఆర్డీవో ఆమె వద్దకు వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు.. ఆర్డీవో మధుసూదన్ పెద్దకొడుకు కృష్ణకి ఫోన్ చేసి తల్లిని తీసుకెళ్లాలని సోమవారం ఇద్దరు హాజరుకావాలని ఆదేశించారు..
