సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎప్పుడు వచ్చినా మేం రెడీ అన్నారు. క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్ లో ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ 16వ క్రికెట్ టౌర్నమెంట్ ను ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు సొంటిరెడ్డి పున్నారెడ్డి, కందాది జ్యోత్స్నా శివారెడ్డి కౌన్సిలర్,గొల్ల జాన్ NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పృథ్వి NSUI కార్యదర్శి,, అందే లోవకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి యువతతో కలిసి క్రికెట్ ఆడారు. రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారు. దేశంలో టెక్నాలజీ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిది..ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే కారణం రాజీవ్ గాంధీయే. ఈ టెక్నాలజీ ని తీసుకొని రావడం వల్ల యువతకు ఉపాధి దొరికింది. ఇంతటి మహా నేత రాజీవ్ గాంధీ పేరు మీద కుత్బుల్లాపూర్ లో NSUI ఆధ్వర్యంలో క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉంది. బీజేపీ -టీఆర్ఎస్ ప్రభుత్వాలు పబ్లిక్ కి సర్వీస్ చేయడం లో ఫెయిల్ అయ్యాయి ఇది చాలా దురదృష్టకరం అన్నారు.
Read Also: Techie Missing Mystery: వీడిన ఇంజనీర్ మిస్సింగ్ మిస్టరీ.. ఆ బాధలు భరించలేకే..
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం, పార్లిమెంట్ ఎన్నికలకు ఇంకో సంవత్సరాంనర్రా ఉండగానే ఎన్నికల వాతావరణం క్రియేట చేస్తున్నారు.టీఆర్ఎస్- బీజేపీ దాగుడుమూతల ఆటా ఆడుతున్నాయి..కేంద్ర ప్రభుత్వం ఐటీ ,ఈడీ దాడులతో,రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు తో ఆటలు ఆడుతున్నారు.దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం, ప్రయోజనం లేదు.ప్రజా సమస్యలకు సంబందించిన అంశాలే చర్చకు లేవు..టీవీలు ఆన్ చేస్తే చాలు బీజేపీ -టీఆర్ఎస్ కొట్టుకోవడం కోరుకోవడం ఇదే న్యూస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సనస్యలు గాలికి వదిలేసి కొట్టుకోవడం చాలా దురదృష్టకరం అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడొద్దు అనే చెప్తాము.పార్టీ మారడం వారి వ్యక్తిగతం..కానీ బీజేపీ లకు పోవడం సాధించిదేమి ఉండదని చెప్పగలను.తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా కాంగ్రెస్ దే పై చేయి..దింట్లో ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ఇక్కడ ఏదైనా మాట్లాడొచ్చు, అడగొచ్చు, పని చేయొచ్చు ఇది మారే పార్టీ లో లేదు. కాంగ్రెస్ పార్టీ విడి బీజేపీ లో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి నష్టం లేదు.
40 నుండి 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కి బలమైన గెలిచే అభ్యర్థులు ఉన్నారు… బలమైన నాయకత్వం ఉందన్నారు జగ్గారెడ్డి. బీజేపీ లో నాయకులు లేరు కనుకే కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నాయకులను జల్లెడ పడుతుంది. కాంగ్రెస్ నాయకులును మొన్నటివరకు టీఆర్ఎస్ తీసుకుపోయింది ఇప్పుడు బిజేపీ తీసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం..ఒక బిందెడు నీళ్లు, టీఆర్ఎస్, ఒక బిందెడు బిజేపీ వారికీ అవసరం వచిన్నపుడు ముంచుకొని తీసుకొని పోతున్నారు. పార్టీ మారిన వారు తర్వాత బాధపడతారు.. ముందస్తు ఎన్నికలు వచ్చిన, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి బలమైన అభ్యర్థులు ఉన్నారు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
Read Also: Kishan Reddy: MMTS ఫేజ్ – II ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ఎవరు?