తెలంగాణ కాంగ్రెస్ లో మరో పాదయాత్ర ప్రారంభం కానుంది. 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు ప్రారంభం అయ్యాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పాదయాత్ర చేస్తా అనుమతి ఇవ్వాలని లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Also Read : Naresh Agastya: ‘#మెన్ టూ’ రిలీజ్ డేట్ మారింది!
హాత్ సే హాత్ జొడో లో భాగంగా నేను కూడా యాత్ర చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో పాదయాత్రకి జగ్గారెడ్డి అనుమతి కోరారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. జగ్గారెడ్డి ఎన్టీవీతో ఫేస్ టూ ఫేస్ మాట్లాడుతూ.. నా ఆవేదన ఎపిసోడ్ ముగిసింది.. మెదక్ నుంచి పాదయాత్ర మొదలు పెడతా.. పాదయాత్రకి అనుమతి వస్తుందని ఆశిస్తున్నా.. ఎవరికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయడం లేదు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Also Read : Tammineni Veerabhadra : ఆ పార్టీతోనే కలిసి ఉంటాం.. సీట్ల పంపకాలు తరువాత..
రాష్ట్రంలో ఇప్పటికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయని చాలా నియోజకవర్గాలు ఉన్నాయి.. ఆ నియోజకవర్గాల్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాదయాత్ర చేస్తాను అంటూ జగ్గారెడ్డి వెల్లడించారు. పాదయాత్ర ఎవరు చేసినా పార్టీకి లాభమే.. రేవంత్ జోగులాంబ నుంచి చేస్తే.. నేను మరో చోటు నుంచి చేస్తా అంటూ జగ్గారెడ్డి అన్నారు.
Also Read : Jagananna Vidya Kanuka: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లు తెరిచిన రోజే విద్యాకానుక..
పార్టీలోని సీనియర్ నేతలతో కూడా మాట్లాడతాను అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నాక్కూడా బాధ్యత ఉంది.. పాదయాత్రకి ఎందుకు అనుమతి ఇవ్వరు?.. గొడవలు ఎందుకు అని గాంధీ భవన్ కి దూరంగా ఉన్న అంతే అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పార్టీ నాకు పని కూడా చెప్పలేదు.. రాజకీయాల్లో అలగడం తప్పు.. నేను అలిగి పార్టీకి దూరంగా లేను.. వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నాను అంటూ జగ్గారెడ్డి తెలిపారు.
