Site icon NTV Telugu

బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సవాల్‌… హిందువుల కోసం రూ.15 లక్షలు ఇప్పిస్తావా!!

Jagga Reddy

Jagga Reddy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. హిందువుల కోసం తాను చెప్పిన 4 అంశాల పై చర్చకు సిద్ధమా…? అని ప్రశ్నించారు. హిందువుల కోసం మోడీతో మాట్లాడి పెట్రోల్, డీజీల్ గ్యాస్ ధరలు తగ్గించగలవా ? తెలంగాణ లో ఉన్న పేద హిందువులకు రూ. 15 లక్షలు మోడీ తో ఇప్పించగలవా ? అని సవాల్‌ విసిరారు జగ్గారెడ్డి. తెలంగాణ లో ఉన్న 80 శాతం హిందువులకోసం మాట మీద నిలపడుతావా ? పాదయాత్రకు నిజాం భూములకు సంబంధం ఏంటి ? అని ప్రశ్నించారు. నిజాం భూములు తీసుకుని 80 శాతం ఉన్న హిందువులకు ఇస్తామని చెప్పగలరా..? రక్తం తాగే పులిలాంటి స్వభావం ఉన్న పార్టీ బీజేపీ అని ఫైర్‌ అయ్యారు. పైకి గోవుల కాపాడుతూ హిందువులను రెచ్చగొడుతున్నారని… ప్రజల సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా హిందువులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మతాల మధ్య గొడవలు కావాలా..! ప్రజలకు మేలు జరుగలా..! అని నిలదీశారు.

Exit mobile version