కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తోట నరసింహం తనయుడు తోట రాంజి మాట్లాడుతూ.. పంది బలిస్తే ఏనుగు కాదు.. పంది పందే అంటూ వ్యాఖ్యానించారు. జగ్గంపేట నుండి నూటికి నూరు శాతం తోట నరసింహం పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు. పదేళ్లు అయినా ఇరువై ఏళ్లు అయినా మీ తాట తీయడానికైన పోటీలో ఉంటారని, నేను రాను మీ మొగుడే పోటీలో ఉంటాడు … అన్ని లెక్కలు తేలుస్తాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. మేము చర్చకి రమ్మన్న సిద్ధమే కాదు తగువే కావాలంటారా దాన్ని కూడా సిద్ధంగానే ఉన్నామని ఆయన తెలిపారు.
Also Read : Jawan: నయనతార పోస్టర్ పై విగ్నేష్ శివన్ కామెంట్స్..ట్వీట్ వైరల్..
ఒక గంట టైం ఇస్తే చాలు.. నాకు రాజకీయం కొత్తేమీకాదు , మా బ్లడ్ లోనే ఉందని, మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే అందరకీ మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ.. మీ ఎమ్మెల్యే 100 ఎకరాలు అవినీతి చేశాడని ప్రతిపక్ష నేత నవీన్ మాట్లాడినప్పుడు మీరందరూ ఏమయ్యారని, ప్రతిపక్ష నేతలు అంటే భయమా లేక తన్నుతారనా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఏ ఎమ్మెల్యే పైన ఇలాంటి ఆరోపణలు ఎవరు చేయలేదని, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఖండించలేదు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఖండించలేదు ఎందువల్ల అని ఆయన అన్నారు. నా గురించి మాట్లాడాలంటే వారి స్థాయి సరిపోదని, నాకోసం మాట్లాడాలంటే వాళ్ళు పది జన్మలెత్తాలని ఆయన అన్నారు. నాకు గత మూడు సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాలేదు కనుక నా కార్యకర్తల కోసం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నానని, ఇందులో రాజకీయ కోణం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే 100 ఎకరాలు సంపాదించారని 100 కోట్లు తినేశారని అనేక అవినీతి ఆరోపణ చేశారు అప్పుడు ఈ బాబు ఎక్కడున్నాడని ఆయన అన్నారు.
Also Read : Sonia Gandhi: కొత్త కూటమికి అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ?