NTV Telugu Site icon

Congress: జగ్గారెడ్డి వర్సెస్ దామోదర రాజనర్సింహ.. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ

Congress

Congress

Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక కాంగ్రెస్‌లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్‌చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. అయితే, నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుంచి శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మరోవైపు.. పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించడంపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మండిపడుతున్నారు.

Also Read: Minister KTR Exclusive Interview: ఎన్టీవీ లైవ్‌లో మంత్రి కేటీఆర్‌..

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్‌పై జగ్గారెడ్డి వర్సెస్ దామోదర రాజనర్సింహల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నట్లు తెలిసింది. పటాన్‌చెరు టికెట్ నీలం మధు ముదిరాజ్‌కి ఇవ్వడంతో జగ్గారెడ్డిపై కాటా శ్రీనివాస్ భార్య ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో దామోదర్ రాజనర్సింహ జగ్గారెడ్డిని శ్రీనివాస్ గౌడ్, అతని భార్యతో బాధ్నామ్ చేపిస్తున్నాడని జగ్గారెడ్డి ప్రకటించారు. ఇది మంచి పద్ధతి కాదని దామోదర్ రాజనర్సింహను జగ్గారెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే రాజకీయంగా తేల్చుకుందాం…వ్యక్తిగతంగా నన్ను డ్యామేజ్ చేస్తే సహించను అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.