Site icon NTV Telugu

Jagga Reddy: “ఇది మంచిది కాదు”.. జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన జగ్గారెడ్డి..

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: ఎన్టీవీలో వచ్చిన ఓ కథనంపై రేవంత్ సర్కార్ “ఓవర్ రియాక్షన్” చేస్తోంది. జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ ప్రతాపంపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. “తెలంగాణ పోలీసుల చర్యలను ఖండిస్తున్నా.. తలుపులు బద్దలుగొట్టి దౌర్జన్యంగా బద్దలుగొట్టి ఇంట్లోకి వచ్చారు. పండగకు భార్యతో వెళ్తుండగా ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్‌ను లాక్కెళ్లడం సరికాదు. ప్రొసీజర్, నోటీసులు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: KTR: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు

 

Exit mobile version