NTV Telugu Site icon

Jana Reddy : బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ప్రజల్లో ఆదరణ కోల్పోయింది

Jagga Reddy

Jagga Reddy

మిర్యాలగూడలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని, ఏ పార్టీలో ఉన్నా జానారెడ్డి పార్టీ టికెట్లు, పదవులు అడగలేదన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి తనకు అవకాశాన్ని ఆ పార్టీలు కల్పించాయని, రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా గాంధీని ఒప్పించడంలో నా పాత్ర ముఖ్యమైనదన్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని, కేసిఆర్ మాటలు ప్రజలు విశ్వసించట్లేదన్నారు జగ్గారెడ్డి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏంటి? అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని ప్రశ్నించారు. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్ఎస్ నుంచి మనసుమార్చుకుని 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా?, అప్పుడు మా బలం 90 కదా? సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెబుతున్నా?, కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసగాళ్లకు మోసగాళ్లు బీజేపీ నేతలు. మోసాలు చేయడంలో బీజేపీది ఇంటర్నేషనల్‌లో మొదటి ర్యాంక్ అని ఆయన అన్నారు.