జగ్గారెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాతే సంగారెడ్డిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పని చేయించానన్నారు. జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓట్ల కోసం బలహీనుడు కాలేడని, జగ్గారెడ్డి ఓడిపోవడం వల్ల సంగారెడ్డి ప్రజలే బాధపడుతున్నారన్నారు. సంగారెడ్డి లో ఒడిపోవాలని నేనే అనుకున్నానని ఆయన వెల్లడించారు. నన్ను ఓడించడానికి హరీష్ రావు 60 కోట్లు ఖర్చు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వస్తది, రేవంత్ సిఎం అవుతాడు అని ఆనాడే నాకు తెలుసు… నేను గెలిస్తే మంత్రి అవుతా అని కూడా నాకు తెలుసు అని ఆయన అన్నారు. నేను అందుబాటులో లేను అని కొందరు ప్రశ్నించారు…అందుకే 24 గంటలు అందుబాటులో ఉండే వాన్నే గెలిపించుకొండి అన్నాను అని జగ్గారెడ్డి అన్నారు.
భవిష్యత్ లో సంగారెడ్డిలో పోటీ చేయను…ఒకరి వద్ద లాలూచీ రాజకీయం నేను చేయనని ఆయన అన్నారు. ఇక నుంచి నా లైన్ పూర్తిగా పార్టీ లైన్ లోనే , పార్టీ కోసమే పనిచేస్తానని, సంగారెడ్డిలో కూడా రాజకీయాలు చేయను పార్టీ కోసమే పనిచేస్తానన్నారు. జగ్గారెడ్డి ఓడిపోతే నష్టం జగ్గారెడ్డి కి కాదు… సంగారెడ్డి ప్రజలకే అని ఆయన వ్యాఖ్యానించారు. సంగారెడ్డి లో ఓటమి ఆరు నెలల ముందే గుర్తించానని, సంగారెడ్డి ప్రజలు నన్ను రిజెక్ట్ చేయలేదని, నేనే సంగారెడ్డి ప్రజలను రిజెక్టు చేశానన్నారు. ఇకపై పార్టీ కోసమే ఫుల్ టైం కేటాయిస్తానన్నారు.
