Site icon NTV Telugu

Jagapathi Babu: ఆ సినిమా నుంచి నాకు హీరోయినే లేదు: జగపతి బాబు

Jagapathi Babu

Jagapathi Babu

Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరోసారి తన మార్కు సెటైర్లతో వార్తల్లో నిలిచారు. ఆయన కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో జగపతి బాబు సరదాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. తన సినిమాల్లో హీరోయిన్ల ప్రాధాన్యత గురించి ప్రస్తావించారు. “లెజెండ్ సినిమా నుంచి నాకు హీరోయినే లేకుండా పోయింది” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా డజన్ల కొద్దీ హీరోయిన్లతో ఆడిపాడిన జగ్గు భాయ్, సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పవర్‌ఫుల్ విలన్, క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం కావడాన్ని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు.

READ ALSO: Gas Booking Scam : ఫాస్ట్ డెలివరీ అంటూ కేటుగాళ్ల ‘గ్యాస్ బుకింగ్’ లింక్.. క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ..!

ఆసక్తి రేపుతున్న ‘వదలా’ గ్లింప్స్..
ఈ మూవీలో చేసిన యంగ్ హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ కళ్లు చాలా బాగుంటాయని అన్నారు. ఆమె తన కళ్లతోనే అద్భుతమైన నటన ప్రదర్శించింది అని కితాబు ఇచ్చారు. జగపతి బాబు, లయ, మరియు హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన కథాంశంతో వస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత లయ ఈ సినిమాతో వెండితెరపై కనిపిస్తుండటం విశేషం. తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘వదలా’ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగపతి బాబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

READ ALSO: Shivam Dube: ప్రపంచకప్ హీరో సాహసం.. మాస్క్ ధరించి.. థర్డ్ ఏసీలో సామాన్యుడిలా ప్రయాణం! అసలేం జరిగిందంటే?

Exit mobile version