‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం షెడ్యూల్ ఈనెల 29 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సమాచారం పంపింది వైసీపీ కేంద్ర కార్యాలయం.. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో షెడ్యూల్ ని పెంచింది పార్టీ హైకమాండ్.. ఈ నెల 20 వరకే పూర్తి కావల్సి వుందీ కార్యక్రమం.. ప్రజల స్పందనతో మరో 9 రోజులు కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బిజీగా సాగుతోంది. స్ధానిక ప్రజాప్రతినిధులు సచివాలయ కన్వీనర్లు, గృహసారధులుతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టి మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్న పాలనలో జరుగుతున్న మంచిని మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత మన జగనన్న సంక్షేమ పాలనపై వ్యత్యాసంను వివరిస్తూ జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, వైయస్ జగన్‌కు మద్దతుగా 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, వారితో సెల్ఫీలు దిగుతున్నారు. రోజూ లక్షలాదిమంది మిస్ట్ కాల్స్ ఇస్తున్నారు.
Read Also: Man Friendship With Crane : మనిషితో దోస్తి చేసిన కొంగ..
రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రతి ఓటరుకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలు అందిస్తున్నామన్నారు వైసీపీ నేతలు. నాలుగేళ్ల కాలంలో కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజలంతా ఈ నాలుగేళ్ల కాలంలో ఆనందంగా ఉన్నారని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అన్నవి ఏక కాలంలో చేయగలుగుతున్నారు. రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదు. రోడ్లూ వేయాలి, సంక్షేమమూ చేయాలన్నారు. నాడు – నేడు పేరిట నిర్వహిస్తున్న స్కూల్స్ ను చూడండి ఏవిధంగా అభివృద్ధి చెందాయో అన్నది మీకు తెలుస్తుంది. అలానే చిన్నారులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నామని, మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా పోషకాహారం అందిస్తున్నామని, అలానే ధనవంతుల పిల్లలతో సమానంగా పేద బిడ్డలు చదువుకునేందుకు వీలుంగా సౌకర్యాలు కల్పించాం. వారికి బుక్స్, షూ, యూనిఫాం అందించారని నేతలు ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ కు పట్టం కట్టాలని, విపక్షాల కల్లబొల్లి కబుర్లు నమ్మవద్దంటున్నారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.. ఏ రాజకీయ పార్టీ అయినా రికార్డు సమయంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించింది లేదు.. ఎందుకంటే.. రోజుకో రికార్డు తరహాలో ప్రజలను కలుస్తున్నాయి వైసీపీ శ్రేణుల.. 12వ రోజు (ఏప్రిల్ 18) చివరి నాటికి 84 లక్షల కుటుంబాలు మెగా పీపుల్స్ సర్వేలో తమ ప్రతిస్పందనలను నమోదు చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.. రాష్ట్ర ప్రజలు తమ సొంత మరియు తమ పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను మాత్రమే విశ్వసిస్తున్నామని.. రుజువు చేస్తూ పార్టీకి 63 లక్షలకు పైగా మిస్డ్ కాల్‌లు ఇవ్వడం మరో విశేషంగా చెప్పుకోవాలి..ఈ కార్యక్రమం మరిన్ని రోజులు పెంచడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Romantic Fight: రొమాన్స్ విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య.. ఆ తర్వాత ఏమైందంటే?