NTV Telugu Site icon

Jagananna Vidya Deevena: రేపు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

Jagananna Vidya Deevana

Jagananna Vidya Deevana

Jagananna Vidya Deevena: రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కానున్నాయి. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికానికి సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లోసీఎం జగన్ నిధులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా.. 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అందుకోసం రూ. 584 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.

Read Also: Chiranjeevi: తన ఆటో బయోగ్రఫీ బుక్.. చిరు దంపతులకు అందజేసిన బ్రహ్మానందం

ఇదిలా ఉంటే.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్దుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు. అందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: Viral Video: ప్రధానిపై ఇంత ద్వేషమా..! మోడీ పోస్టర్‌పైకి రాయి విసిరిన వ్యక్తి

Show comments