YS Jagan: ఉద్యోగుల విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. సీఎం సీట్లోకి చంద్రబాబు వచ్చి 18 నెలలు అయ్యిందని గుర్తు చేశారు. పెండింగ్ లో నాలుగు డీఏలు ఉన్నాయన్నారు.. ఇప్పటివరకు ఒక్క డీఏ ఇవ్వలేదు.. ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్కటి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. మళ్ళీ నవంబర్ అంటున్నారని విమర్శించారు.. డీఏ అరియర్స్ కూడా రిటైర్డ్ అయ్యాక ఇస్తామన్నారని.. చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదన్నారు.. కోవిడ్ లాంటి కష్ట సమయంలో 10 ఇవ్వాల్సి ఉన్నా కూడా 11 డీఏలు ఇచ్చామని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు..
READ MORE: Mohan Babu: ప్రభాస్ బావ, నీకు త్వరగా పెళ్ళై డజన్ మంది పిల్లలు పుట్టాలి !
అప్పుడే ప్రతీ ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు.. వాళ్ళు తిట్టడం మొదలు పెట్టడంతో సరిచేస్తాం అన్నారు కానీ ఇంకా కొత్తది ఇవ్వలేదని విమర్శించారు.. పోలీసులకు సరెండర్ లీవ్స్ సొమ్ము కూడా ఇవ్వకుండా పండగ చేసుకో అంటున్న చంద్రబాబు.. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతాం అన్నారు వారిని నిలువునా మోసం చేశారని వెల్లడించారు. ఎన్నికల ముందు ఓపీఎస్ అని నమ్మబలికారన్నారు.. ఇప్పుడు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు.. వాళ్ళను త్రిశంకు స్వర్గంలో పెట్టారని ఆరోపించారు.. తాము తెచ్చిన జీపీఎస్ ను అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయన్నారు.. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదని.. తాము వేసిన పీఆర్సీ చైర్మన్ ను రద్దు చేశారు.. కొత్తవాళ్ళను వేయలేదన్నారు. ఉద్యోగులకు పెరగాల్సిన జీతాలు కుట్ర పూరితంగా అడ్డుకుంటున్నారన్నారు..
READ MORE: Anupama Parameswaran : రెండు నెలల్లో అమ్మడి ఖాతాలో త్రీ హిట్స్
“ఉద్యోగులకు మొత్తం 31 వేల కోట్ల బకాయిలు.. వీటి గురించి మాట్లాడరు.. ఒకటవ తారీఖు జీతం లేదు.. ఎప్పుడిస్తారో కూడా తెలియదు.. కోవిడ్ సమయంలో కూడా మేం ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదు.. మా పరిస్తితుల్లో చంద్రబాబు ఉంటే జీతాలు కూడా విపత్తుకు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పేవాళ్ళు.. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 5 కాదు 10 వేలు ఇస్తామన్నాడు.. కుట్రపూరితంగా రోడ్డున పడేశాడు.. మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం.. కాంట్రాక్ట్ ఉద్యోగులకి టైం స్కేల్ ఇచ్చి జీతాలు ఇచ్చాం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ తెచ్చాం.. మా ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 1100 కోట్ల నుంచి 3300 కోట్లకు పెంచాం.. ఇప్పుడు కొత్త కొత్త స్టోరీలు చెప్తున్న చంద్రబాబు.. ఆర్టీసీ ఉద్యోగులపై ప్రస్తుతం చంద్రబాబు కన్నుపడింది.. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం..” అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
