Site icon NTV Telugu

Jagan Mohan Reddy: సీఎం పై రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం.. టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో..?!

1

1

విజయవాడలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకున్నా నేపథ్యంలో రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేసారు పోలీసులు. రోడ్ షోలో జగన్‌ని చూసేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జన సందోహంలో ఎవరో గుర్తుతెలియని ఆగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు వేశారు. ఆగంతకుడు విసిరాయి సీఎం జగన్ నదుటిపైన, అలాగే ఎడమ కంటి కింద గాయమైంది.

Also Read: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..

ఇక ఈ గంటనుకు సంబంధించి దర్యాప్తులో టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో ఉన్న 6 బృందాలకు కేసును అప్పగించారు. జగన్ బస్సు యాత్ర జరిగిన టూర్ మ్యాప్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లపై దర్యాప్తు బృందాల ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం బృందాలు స్కూల్స్, ఇల్లు, షాపుల్లో అందుబాటులో ఉన్న వరకు సీసీటివి ఫుటేజ్ పరిశీలన చేస్తున్నారు. జగన్ పై దాడికి ఉపయోగించిన రాయి గుర్తించటానికి ఘటన జరిగిన పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు క్లూస్ టీమ్.

Also Read: Janhvi Kapoor: అయ్య బాబోయ్.. పాపకి అలా పెళ్లి చేసుకోవాలని ఉందంటా..

ఇక శనివారం అర్థరాత్రి వరకు క్లూస్ టీమ్ పనిచేసినా.. రాయి ఆచూకీ దొరకలేదని సమాచారం. దాడి ఘటన నేపథ్యంలో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఎక్కడ ఉన్నారనే దానిపై నివేదిక సిద్దం చేస్తున్నారు క్రైం పార్టీ పోలీసులు. హై ప్రొఫైల్ కేసు కావటంతో కేసు విచారణలో ఒత్తిడికి పోలీసులు గురవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కేసులో కీలక ఆధారం ట్రెస్ చేయటం ద్వారా కేసును ఓ కొలిక్కి తేవాలని ప్రయత్నాలు పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version