Site icon NTV Telugu

Jagan Mohan Reddy: అభివృద్ధి ఎక్కడ కనిపించనేలేదు.. సంక్షేమం ఊసే లేదు..!

Jagan

Jagan

Jagan Mohan Reddy: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా అయన రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధరలు..!

ఇక రాష్ట్ర ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసారు. ఇందుకు సంబంధించి, కాగ్‌ నివేదికను చూసినట్లైతే.. అభివృద్ధి ఎక్కడ కనిపించలేదని, సంక్షేమం ఊసే లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలం అంతా మోసాలతో గడిపారని, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. అయితే, తమ హయాంలో.. కోవిడ్‌ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపినట్లు జగన్ తెలిపారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, మంచి పరిపాలన అందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!

Exit mobile version