YS Jagan: రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించనున్నారు. తాజాగా జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు.. రేపు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు..10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 11.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు.. 2 గంటలకు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం చేరుకుంటారు.. అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం 2.45 తిరిగి అక్కడ నుంచి బయలుదేరుతారు.. 04.15 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 04.45 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 6 గంటలకు బెంగుళూరుకు చేరుకుంటారు..
READ MORE: BC Reservations : ఉత్కంఠ పెరుగుతోంది.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రూట్ మార్చి..18 కండీషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. “జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు. భద్రత, టూర్ ఏర్పాట్లపై పోలీసులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ఎయిర్ పోర్టు నుంచి మేం ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయం మార్గంలో అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్మిషన్ ఎలా రావాలో.. ఎప్పుడు రావాలో మిమ్మల్ని మేం అడగలేదు. పోలీసులు తాజాగా ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే పర్యటన కొనసాగుతుంది.. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు మార్గ మధ్యలో జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, బల్క్ డ్రగ్ పార్క్ సహా అన్ని సమస్యలపైన మా స్టాండ్ క్లియర్ గా ఉంది..” అని పేర్కొన్నారు.
