NTV Telugu Site icon

YS Jagan: వారికి శుభాకాంక్షలు తెలిపిన జగన్..

Ys Jagan

Ys Jagan

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలుగు వారు ఉన్నారు. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌ రావడంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ సీఎం.. ఎక్స్‌లో పోస్టు చేశారు.

READ MORE: Hero Splender : హీరో స్ప్లెండర్ ధర ఎంత ? అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ కొనడానికి ఎంత ఈఎంఐ చెల్లించాలి?

“విఖ్యాత వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్స నందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధుని వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.” అని జగన్‌ తన పోస్టులో రాసుకొచ్చారు.

READ MORE:Sankranthiki Vasthunam: రాజమండ్రిలో సందడి చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” యూనిట్