Site icon NTV Telugu

Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

Jade Damarell

Jade Damarell

Jade Damarell: బ్రిటన్‌లో జరిగిన విషాదకర ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 32 ఏళ్ల అనుభవజ్ఞురాలైన పారాచూట్ డైవర్ జేడ్ డామరెల్‌ (Jade Damarell) గత నెలలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించింది. అయితే, ఇది యాక్సిడెంట్ కాదని.. తనకుతానే సూసైడ్‌కు పాల్పడిందని తాజాగా తేలింది. ఓ నివేదిక ప్రకారం, ఈ దారుణ ఘటనకు ముందు రోజు ఆమె ప్రియుడు బెన్ గుడ్‌ ఫెలో ఆమెకు బ్రేక్ అప్ చెప్పినట్లు సమాచారం.

Read Also: Tummidihetti Barrage: నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఎమ్మెల్యే హరీష్ బాబును అడ్డుకున్న పోలీసులు!

జేడ్‌కు ఇప్పటికే 400కు పైగా పారాచూట్ డైవ్‌లు చేసిన అనుభవం ఉంది. ఆమె 26 ఏళ్ల స్కైడైవర్ అయిన బెన్‌ గుడ్ ఫెలో (Ben Goodfellow) తో గత ఎనిమిది నెలలుగా ప్రేమలో ఉంది. ఇద్దరూ షాటన్ కొల్లియరీలోని ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో ఒకే గదిలో నివాసం ఉండేవారు. వాళ్లు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇతరులతో ఎక్కువగా కలవకుండా ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారని ఆమె సన్నిహితులు తెలిపారు. అయితే, దురదృష్టకరంగా ఘటనకు ముందు రోజు రాత్రి బెన్ ఆమెతో బ్రేకప్ చెప్పాడు. మరుసటి రోజు బెన్ పని కోసం వెళ్లగా, జేడ్ ఆ పారాచూట్ జంప్‌కి వెళ్లి…సాయంగా పారాచూట్ విడుదల చేయకుండా నేరుగా కిందపడి చనిపోయింది.

Read Also: Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

ఈ విషయం పోలీసుల దర్యాప్తులో జేడ్ రాసిన సూసైడ్ నోట్ కూడా బయటపడింది. అందులో బ్రేకప్ గురించి ప్రస్తావించినట్టు సమాచారం. జేడ్, బెన్‌ లు ఇదివరకు కొన్ని సార్లు బ్రేకప్ చేసినప్పటికీ, ఈసారి ఇలా జరుగుతుందని అనుకోలేదన్నట్టుగా వారి స్నేహితుడు తెలిపాడు. ఈ ఘటనతో బెన్ ప్రస్తుతం తీవ్రంగా దిగ్బ్రాంతికి గురై ఉన్నాడని అతని సన్నిహితులు తెలిపారు. ఇక జేడ్ డామరెల్, లీడ్స్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాక సిల్వర్ స్పూన్ అనే సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బెన్ గుడ్‌ఫెలో మాత్రం నిస్సాన్ కంపెనీలో టెక్నీషియన్‌గా పని చేస్తూ.. సండర్లాండ్‌కు చెందిన “పోస్ట్ రోమ్” అనే బ్యాండ్‌లో సింగర్ అండ్ గిటారిస్ట్‌ గా ఉన్నాడు.

Exit mobile version