NTV Telugu Site icon

Jadcharla: ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ది చెప్పండి: చెర్లకోల స్వరణ్

Mla Laxmareddy

Mla Laxmareddy

Jadcharla: జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన కుమారుడు చెర్లకోల స్వరణ్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డికి అండగా ఉండి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్ నేడు మిడ్జిల్ మండలం దొనూర్, వెలుగొముల గ్రామాల్లో ప్రచారం సందర్భంగా ప్రజలను కోరారు.

Also Read: Minister Niranjan Reddy: మజీద్‌ల వద్ద ముస్లిం సోదరులను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ సందర్భంగా చర్లకోల స్వరణ్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆర్థిక వనరులను బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చి, గ్రామాలను అభివృద్ధి బాటలో నడపడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర పదేళ్ల పాలన, సమైక్య రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తే అభివృద్ధి ఎవరు చేశారో అర్థం అవుతుందని తెలిపారు.