NTV Telugu Site icon

Jacqueline Fernandez : షార్ట్ ఫ్రాక్ లో కిర్రాక్ పోజులిస్తూ మతిపోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 11 At 11.29.26 Am

Whatsapp Image 2023 08 11 At 11.29.26 Am

జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ శ్రీలంక భామ 2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగు లో రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. ఈ భామ హీరోయిన్ గా అదరగొడుతూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది.ప్రభాస్ హీరో గా నటించిన సాహో చిత్రంలో జాక్విలిన్ ఐటెం సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో జాక్విలిన్ తన హాట్ గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది.

తెలుగులో జాక్విలిన్ కి హరి హర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఆమె ఆ ఆఫర్ ను వదులుకున్నారు.దీనితో ఆమె స్థానం లో నోరా ఫతేహి కు ఆ ఆఫర్ దక్కింది.ఇటీవల జాక్విలిన్ విక్రాంత్ రోనా సినిమాలో ఆమె గెస్ట్ రోల్ చేసింది. సుదీప్-జాక్విలిన్ పై తెరకెక్కిన రా రా రక్కమ్మ సాంగ్ బాగా ట్రెండింగ్ అయింది.ప్రస్తుతం జాక్విలిన్ క్రాక్ మరియు ఫతేహ్ అనే రెండు సినిమాలు చేస్తుంది.. జాక్విలిన్ కు సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.నిత్యం తన హాట్ గ్లామర్ తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా జాక్విలిన్ షార్ట్ ఫ్రాక్ లో కిరాక్ పోజులిస్తూ రెచ్చగొట్టింది.చాలీ చాలని డ్రెస్ లో హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఈ భామ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ దిగిన హాట్ పిక్స్ ఫ్యాన్స్ కు షేర్ చేసింది..ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.