LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘బ్లాక్’ (Black) సీఈఓ జాక్ డోర్సే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన సంస్థ బ్లాక్‌లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్స్) ఆయన.. ఇప్పుడు కంపెనీల్లోని ‘మిడిల్ మేనేజ్‌మెంట్’ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య స్థాయి ఉద్యోగుల అవసరం ఇకపై ఉండబోదని.. ఆ బాధ్యతలను కృత్రిమ మేధ (AI)తో భర్తీ చేయాలని ఆయన ఇతర టెక్ కంపెనీలకు సూచించారు.
ఎందుకీ నిర్ణయం..?
జాక్ డోర్సే అభిప్రాయం ప్రకారం.. ఒక సంస్థలో మిడిల్ మేనేజ్ మెంట్ కేవలం సమాచారాన్ని పైస్థాయి నుంచి కింది స్థాయికి చేరవేసే వారుగానే మిగిలిపోతున్నారు. దీనివల్ల పనిలో వేగం తగ్గడమే కాకుండా, కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇలాంటి పునరావృతమయ్యే పనులను ఏఐ చాలా సమర్థవంతంగా.. వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలదని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
Also Read:Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..
బ్లాక్ సంస్థలో భారీ మార్పులు…
డోర్సే తన పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’లో ఇప్పటికే భారీ మార్పులు చేపట్టారు. సమర్థతను పెంచేందుకు, అదనపు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా, మిగిలిన పనిని ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన..
జాక్ డోర్సే సూచనలు టెక్ నిపుణులలో చర్చకు దారితీశాయి. ఒకవైపు ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని టెక్ దిగ్గజాలు వాదిస్తుంటే.. మరోవైపు అనుభవజ్ఞులైన మధ్య స్థాయి ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కేవలం కోడింగ్ లేదా మేనేజ్‌మెంట్ మాత్రమే కాకుండా.. ఏఐని నియంత్రించే నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి.. టెక్ రంగం కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా.. సంపూర్ణంగా ఏఐ ఆధారిత పని వైపు వేగంగా అడుగులు వేస్తోందని డోర్సే మాటలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..