యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై హీరో నితిన్ అలాగే దర్శకుడు వక్కంతం వంశీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే సినిమాలో ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్ప వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కూడా కనిపించలేదు.రచయితగా సక్సెస్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. తన పెర్ఫార్మన్స్ తో నితిన్ వన్ మ్యాన్ షో చేసిన ఫలితం లేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వక్కంతం వంశీ దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టిందని చెప్పొచ్చు..వినోదం అందిస్తాయి అనుకున్న సన్నివేశాలు విమర్శలు వచ్చేలా చేశాయి.. రికార్డింగ్ డ్యాన్స్ లలో వేసే ‘నా పెట్టే తాళం’ పాటతో మరింతగా విసుగుపుట్టించారు. అది కూడా పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్స్ పాత్రలతో ఈ సాంగ్ పెర్ఫామ్ చేయించడం మరిన్ని విమర్శలకు దారి తీసింది.ఈ సాంగ్ లో జబర్దస్త్ సత్య ఫెర్ఫార్మ్ చేసింది.. తాజాగా ఈ సాంగ్ గురించి సత్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
షూటింగ్ కి మూడు రోజుల సమయం ఉండగా ఈ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.ముందుగా సిట్యువేషన్ తగ్గ పాటలో డ్యాన్స్ చేయాలనీ ఆమెకు చెప్పారట. ఏమి సాంగ్ అది అని అడిగితే వల్గర్ గా ఏమి ఉండదు.. సిట్యువేషన్ కి తగ్గట్లుగా వస్తుంది అని చెప్పారు. దీనితో నేను ఒకే చెప్పా. కానీ షూటింగ్ కి ఒకరోజు ముందు మాత్రమే నేను సాంగ్ విన్నాను. అప్పుడే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సమయంలో ఈ పాట చేయలేనని చెప్పలేను. ఎందుకంటే షూటింగ్ కి అంతా రెడీ అయిపోయింది. భయపడుతూనే షూటింగ్ కి వెళ్ళా.సాంగ్ ప్రధానంగా నా మీదే ఉంటుంది. అట్రాక్ట్ చేసే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సెక్సీగా డ్యాన్స్ చేయాలి అని అన్నారు. నేను డ్యాన్స్ చేస్తున్నాను కానీ ఎంత ప్రయత్నించినా కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ నా వల్ల కావడం లేదు. శేఖర్ మాస్టర్ నాకు ఎంతో వివరంగా చెప్పారు. నీ మీదే ప్రధానంగా సాగే పాట ఇది. హీరోతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం. ఇలాంటి ఆఫర్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. మిస్ చేసుకోవద్దు అని ఆయన అన్నారు. డైరెక్టర్ కూడా నువ్వేమి వల్గర్ గా చేయడం లేదు కదా.ఎక్స్ ఫోజింగ్ కూడా లేదు.ఈ పాటని మేము ముంబై డ్యాన్సర్లతో చేయించాలని అనుకున్నాం. ఎందుకంటే హావభావాలు సెక్సీగా ఉండాలి అని వక్కంతం గారు తెలిపారు.కావలసిన హావభావాలు ఇవ్వడానికి నాకు ఏకంగా 15 టేకులు పట్టింది. కానీ మధ్య మధ్యలో శేఖర్ మాస్టర్ ని చాలా సార్లు అడిగాను.. మాస్టర్ ఇది జనాల్లోకి వేరేలాగా వెళ్ళదు కదా అని అడుగుతూనే ఉన్నాను.అలా ఏమి ఉండదు అని ఆయన నాకు ధైర్యం చెప్పారు. అలాగే సాంగ్ ముగిసాక సత్య ఇరగదీశావ్ అంటూ నితిన్ గారు అందరి ముందు నన్ను మెచ్చుకున్నట్లు సత్య తెలిపారు.