NTV Telugu Site icon

Bhagavanth Kesari Trailer: దసరా దావత్ షురూ.. ఓరుగల్లు గడ్డపై బాలయ్యబాబుకు తలకాయ కూర!

Ravi Gave Talakaya Curry To Balakrishna

Ravi Gave Talakaya Curry To Balakrishna

Jabardasth Racha Ravi Funny Speech At Bhagavanth Kesari Trailer Launch Event: నందమూరి బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్‌ కేసరి’. బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హనుమకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో కమెడియన్, ఓరుగల్లు బిడ్డ ‘రచ్చ రవి’ రచ్చ రచ్చ చేశాడు.

భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో రచ్చ రవి మాట్లాడుతూ… ‘భగవంత్‌ కేసరి సినిమాలో అవకాశం ఇచ్చిన అన్నయ్య అనిల్‌ రావిపూడి గారికి ధన్యవాదాలు. బాలయ్యబాబు గారితో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓరుగల్లు గడ్డపై అందరిని ఇలా చూసినందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. అప్పటివరకు రచ్చ రవి చాలా నెమ్మదిగా మాట్లాడగా.. యాంకర్ రవి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. బాలయ్యబాబు ఉన్నందుకు బయపడి మాట్లాడుతున్నావ్ రచ్చ అని రవి అనగా.. మా డైరెక్టర్ ఓవర్ చేయకుండా, కంటెంట్ మాత్రమే మాట్లాడాలని చెప్పాడని ఆయన బదులిచ్చాడు. ఆపై రచ్చ రవి ‘రచ్చ’ మొదలైంది.

‘నా ఓరుగల్లు ముద్దుబిడ్డలారా.. ఈ గడ్డ మీదనే పుట్టినా. నేను ఎందరో రాజుల గురించి విన్నా కానీ కళ్లారా చూడలే. సినిమా అనే నా ప్రపంచంలో ఓ రాజును చూసిన. రాజంటే రాజ్యమున్నోడు కాదు, బలగామున్నోడు కాదు.. రాజంటే ఓ దైర్యం ఇచ్చేటోడు. సినిమా పరిశ్రమలో నిర్మాతలకు ధైర్యాన్ని ఇస్తాడు. పాలనా రోజు ఈ సినిమా రిలీజ్ పక్కా అనే నమ్మకం ఇస్తడు. బాలయ్యబాబు సినిమా చేసినం.. పైసలు బీరువాట్లో ఉన్నట్లే. బాలయ్యబాబు గారు.. మీరు చిన్ని కృషుని లెక్కనే’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Also Read: KL Rahul: నాకు సెంచరీ ముఖ్యం కాదు.. జట్టు విజయమే ముఖ్యం!

అంతేకాదు ఓరుగల్లుకు వచ్చిన బాలయ్యబాబుపై తనకు ఉన్న ప్రేమను రచ్చ రవి చాటుకున్నాడు. తన ఇలాకాకు వచ్చిన బాలకృష్ణకు తలకాయ కూర ఇచ్చాడు. తన అమ్మ వండిన వంటకాలను రచ్చ రవి ఆమె చేతుల మీదుగానే బాలయ్యబాబుకు అందించాడు. దసరా పండగ దావత్ షురూ అయిందని చెప్పాడు. ఆపై కుటుంబసభ్యులతో కలిసి ఫొటో దిగాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలస్యం ఎందుకు వీడియో చూసి మీరు కూడా తెగ నవ్వుకోండి.

Show comments