NTV Telugu Site icon

Shakib Al Hasan: నా జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది.. మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌పై షకిబ్‌!

Angelo Mathews Wicket

Angelo Mathews Wicket

Bangladesh Captain Shakib Al Hasan React on Angelo Mathews Timed Out dismissal: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కన్నా ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి.. టైమ్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్‌.. గార్డ్‌ తీసుకోకుండా హెల్మెట్‌ (కొత్త హెల్మెట్‌) కోసం వేచి చూశాడు. సమయం మించిపోవడంతో బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ హల్ హాసన్ ఔట్‌ కోసం అప్పీలు చేయగా.. అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై షకిబ్‌ స్పందించాడు.

తాను ఆటలోని నిబంధనల ప్రకారమే ఆడుతున్నానని, ఎవరికైనా సమస్య ఉంటే నిబంధనలను మార్చమని ఐసీసీని కోరాలని బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ హల్ హాసన్ ఘాటుగా స్పందించాడు. ఆ సమయంలో తన జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించిందన్నాడు. ‘నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఏంజెలో మాథ్యూస్‌ ఇంకో హెల్మెట్‌ కోసం అడిగాడు. ఆ సమయంలో నా సహచర ఆటగాడు నా దగ్గరకు వచ్చి మనం అప్పీల్‌ చేస్తే.. అంపైర్‌ మాథ్యూస్‌ని ఔట్‌గా ప్రకటిస్తాడని చెప్పాడు. టైమ్డ్‌ ఔట్‌ ఐసీసీ నిబంధనల్లో ఉందని తెలిపాడు. వెంటనే నేను అప్పీల్‌ చేశా’ అని షకిబ్‌ తెలిపాడు.

Also Read: Angelo Mathews Wicket: నా పదిహేనేళ్ల కెరీర్‌లో.. ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు: మాథ్యూస్‌

‘సీరియస్‌గానే అప్పీల్‌ చేస్తున్నావా? అని అంపైర్స్ నన్ను అడిగారు. ఐసీసీ నిబంధనల్లో ఉంది కాబట్టి అవుననే చెప్పా. అది తప్పోఒప్పో తెలీదు కానీ.. నేను యుద్ధంలో ఉన్నాననిపించింది, జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది. అందుకే అప్పీల్ చేశా. ఆటలోని నిబంధనల ప్రకారమే నేను అప్పీల్ చేశా. ఎవరికైనా సమస్య ఉంటే.. నిబంధనలను మార్చమని ఐసీసీని కోరండి. దీనిపై చర్చ సాగుతూనే ఉంటుంది. విజయం సాధించడంలో టైమ్డ్‌ ఔట్‌ ఉపయోగిపడిందని నేను అంగీకరిస్తా’ అని బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ చెప్పాడు.

Show comments