Site icon NTV Telugu

Nirmala Sitharaman: రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశం అందించిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సందేశాన్ని నిర్మలా సీతారామన్‌ అందించారు. రామోజీ మరణవార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపమని ప్రధాని తనను పంపారని ఆమె పేర్కొన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటు అన్నారు. తెలుగువారికి ఇదొక పెద్ద విషాదమని.. రామోజీ ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల కిందట కూడా ప్రధాని ఆరా తీశారని నిర్మల పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రధానికి తెలుసునన్నారు. మనందరికీ ఇదొక పెద్ద విషాదవార్త అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

 

Exit mobile version